FbTelugu

దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన వివరాలను దోస్త్ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
– జులై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
– జులై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
– జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

– జులై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం
– జులై 23 నుంచి 29 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
– జులై 23 నుంచి 30 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
– ఆగస్టు 7న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
– ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
– ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
– ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
– సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం.

You might also like