FbTelugu

వదంతులు నమ్మి ఆందోళనకు గురికావద్దు: అవంతి

విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో వస్తోన్న వదంతులను ప్రజలు నమ్మి ఆందోళనకు గురికావద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో మాట్లాడుతూ.. పలు విశయాలను వెల్లడించారు.

ప్రస్తుతం విశాఖలో గ్యాస్ లీకేజీ అయిన ప్రాంతంలో ఉష్ణోగ్రత బాగా తగ్గిందని తెలిపారు. విశాఖ పరిస్థితులను ఎప్పటికప్పుడు మంత్రులు సమీక్షిస్తున్నారని తెలిపారు. ఆస్పత్రుల్లోని వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రావడానికి ప్రజలు రెండ్రోజులు సహకరించాలని కోరారు.

You might also like