FbTelugu

కరోనాపై ఆందోళన వద్దు: అవంతి

అమరావతి: కరోనా వైరస్ పట్ల ఆందోళన వద్దని, త్వరితగతిన వ్యాధినుంచి బయటపడే వైద్యం ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని తెలిపారు.

విశాఖలో కేసులు పెరిగినప్పటికీ వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలో 25 కంటైన్మెంట్ జోన్లుమాత్రమే ఉన్నాయని తెలిపారు. వైసీపీ హయాంలో ఎల్జీపాలిమర్స్ కంపెనీకి ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని అన్నారు. దీనిపై చంద్రబాబు చర్చకు రమ్మంటున్నారని.. అయితే తాము చర్చకు హైదరాబాద్ వెళ్లాలా అని ప్రశ్నించారు.

You might also like