FbTelugu

‘తక్కువ అంచనా వేయొద్దని గతంలోనే చెప్పాం’ : బాబు

అమరావతి: కరోనా వైరస్ ను తక్కువ అంచనా వేయోద్దని ప్రభుత్వానికి గతంలోనే చెప్పామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి గురించి నిత్యం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. అయినప్పటికీ కరోనా నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను దాచిపెడుతూ తక్కువచేసి చెబుతున్నారని ఆరోపించారు.

You might also like