FbTelugu

సిగ్గుంటే.. చిన్నపిల్లలపై ట్వీట్స్ పెట్టరు: బుద్ధా వెంకన్న

Dont-tweets-on-little-children-says-Buddha-Venkanna

అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి వైసీపీ నాయకులపై ట్విట్టర్ వేధికగా నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. నిరా రక్షత, దీవితాన్ని, సంఘ సస్కర్తలు, రాజిక సౌద్దన్నాన్ని అని మీ తింగరి మాలోకం చదివిన తరువాత మీకు తెలుగుపై కోపం రావడం సహజం అన్నారు. చూసి చదవడం రానంత మాత్రాన ఎటువంటి ప్రణాళిక లేకుండా ఉన్నట్టుండి తెలుగు మీడియం స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియం చేసేస్తాం అంటే ఎలా విజయసాయి రెడ్డి అంటూ ప్రశ్నించారు. మీ మీడియాలో రాసేవి అన్ని అసత్యాలు అని మీరే ఒప్పుకోవడం హై లైట్ అన్నారు. చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతా అంటే మీ తెలుగు లెస్సేనా, ఎందుకింత తెగులు’ అని మీ పత్రికే రాసిందంటూ గుర్తు చేశారు. కాస్తైనా మీలో సిగ్గు ఉంటే నీచంగా చిన్న పిల్లల గురించి ఇక మీదట ట్వీట్స్ పెట్టరని అనుకుంటున్నా.. అని ట్వీట్ చేశారు.

You might also like