FbTelugu

టీటీడీ ఆస్తులు విక్రయించొద్దు: నాగబాబు

టాలీవుడ్ నటుడు, టీవీ షో జడ్జీ కొణిదెల నాగబాబు ఈ మధ్య హిందూ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు.

మొన్న మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేకు మద్దతుగా ట్వీట్ చేసిన నాగబాబు తాజాగా టీటీడీ ఆస్తులపై విమర్శలు ఎక్కుపెట్టారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి కి సంబంధించిన ఆస్తులను కాపాడే బాధ్యత తిరుమల తిరుపతి పాలకమండలిదేనని ట్వీట్ చేశారు.

అంతే కాని స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు.. హిందువుల మనోభావాలను దెబ్బ తీయకండి. నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఆస్తుల విక్రయం విషయంలో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు నాగబాబు ట్వీట్ చేశారు.

konidela nagababu

You might also like