FbTelugu

రూ.25 వేలొద్దు.. హెల్త్ కార్డులు కావాలి

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువు లీకేజీతో ప్రభావానికి గురైన ఆయా గ్రామ ప్రజలకు ఒక్కొక్కరికి రూ.25 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. తమకు ఆ 25 వేలు ఏమొద్దని తమకు హెల్త్ కార్డులు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు.

ఇవాళ కేజీహెచ్ ఆస్పత్రుల్లోని వారిని 4 బస్సుల్లో తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే తమకు పూర్తిస్థాయి వైద్యం అందించాలని గ్యాస్ బాధితులు డిమాండ్ చేశారు. పూర్తి వైద్యం అందేవరకు గ్రామాలకు వెల్లబోమని తేల్చిచెప్పేశారు. దీంతో బస్సులను అధికారులు వెనక్కి పంపారు. బాధితులు తిరిగి ఆస్పత్రి వార్డులకి వెళ్లారు.

You might also like