FbTelugu

సెకండ్ వేవ్ లో రెండు మాస్కులు తప్పదా!

వాషింగ్టన్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి సమయంలో ఊహకు అందని విధంగా పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు లభ్యం కాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ కొరత కారణంగా పలువురు రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తకు నడక నేర్పే విధంగా  సాగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒకే ఒక అస్త్రం మాస్కు అని అమెరికా స్పష్టం చేసింది. అది కూడా ఒక్కటి కాదు.. రెండు ధరించాలని హెచ్చరించింది. ఏకకాలంలో రెండు మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పేర్కొంది. ఇంట్లో ఉన్న సమయంలో కూడా మాస్కులు ధరించాలని, ఇతరులకు సోకకుండా ప్రమాదం తప్పించినవారు అవుతారన్నారు. ఒకటి క్లాత్ మాస్క్ ధరించి, దానిపై సర్జికల్ మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.