FbTelugu

ఆ ప్రాంతంలో లాక్ డౌన్ తప్పదా?

హైదరాబాద్: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసులు విపరీతంగా వస్తున్నాయి. ప్రతి 50 మందిలో 20 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో లాక్ డౌన్ విధించనున్నట్లు తెలిసింది.

కరోనా అంతకంతకూ విస్తరిస్తుండడంతో కార్పొరేషన్ పాలకవర్గం కట్టడి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. మొత్తం 70వేలకు పైగా నివాస సముదాయాలు ఉండడంతో, ఇంటింటి సర్వే చేపట్టారు. మున్సిపల్, వైద్య ఆరోగ్య సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి 2 వేల నివాస సముదాయాల్లో సర్వే పూర్తయింది. కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్ లు అందచేశారు.

కేసుల ఉధృతి అధికంగా ఉండడంతో కార్పొరేషన్ అధికారులు, పాలకవర్గం లాక్ డౌన్ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వంతో చర్చించి లాక్ డౌన్  పై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.