FbTelugu

కరీంనగర్ పోలీసులను విడిచే ప్రసక్తి లేదు…

Dont-leave-Karimnagar-police

ఢిల్లీ: ఆర్టీసీ డ్రైవర్ అంతిమయాత్ర సందర్భంగా తనపై దురుసుగా ప్రవర్తించిన కరీంనగర్ పోలీసులను విడిచే ప్రసక్తి లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇవ్వాళ ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కలిసి ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. కమిషన్ సభ్యులు జ్యోతి కార్లను కలిసి తనపై పోలీసులు ప్రవర్తించిన తీరును వివరించారు.

కరీంనగర్ పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన ఫోటోలను చూపించారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతోనూ సమావేశమై ఇదే విషయంపై చర్చించి, దాడి తాలూకు వివరాలు అందచేశారు. బుధవారం లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాతో సమావేశమై పోలీసుల దాడిపై ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇవ్వనున్నారు.

You might also like