FbTelugu

దాతలు ఇచ్చిన ఆస్తులు అమ్మేస్తారా?: కృష్ణంరాజు

తూ.గో.జిల్లా: టీటీడీ దేవస్థానం ఆస్తుల అమ్మకాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సత్య కృష్ణంరాజు తేటగుంటలోని తన స్వగృహంలో నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది భక్తులకు ఇలావేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను నిరార్ధక ఆస్తులుగా అమ్మడం చాలా తప్పని అన్నారు. భక్తులు తమ ఇష్టదైవానికి ఎంతో పవిత్ర ఆశయంతో తమ ఆస్తులు స్వామివారికి కానుకలుగా ఇస్తారని అటువంటి ఆస్తులను దాతల ప్రమేయం లేకుండా అమ్మాలని నిర్ణయించడం భావ్యం కాదని సత్య కృష్ణంరాజు అన్నారు.

ప్రస్తుతం ఈ అంశం తాత్కాలికంగా నిలుపుదల చేసినా భవిష్యత్తులో దేవాదాయ ఆస్తులు అమ్మకుండా వాటిని కాపడేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఉపావాస దీక్షలో ఆయనతోటు బీజేపీ నాయకులు చిరంజీవి కామర్సు పాల్గొన్నారు.

You might also like