FbTelugu

అంతమందికి వీర్యదానం.. నేనెవరికి చేసుకునేది పెళ్లి?

న్యూయార్క్: యుక్త వయస్సు రాగానే ఎవరైనా సరే నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారు. మరికొందరు మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటారు.
తను కోరుకున్న అమ్మాయి తన రక్త సంబంధీకురాలు అని తెలిస్తే గుండెలు పగిలినంత పని అవుతుంది. ఇలంటి విచిత్ర పరిస్థితిని అమెరికాలో ఒక యువకుడిని వేధిస్తున్నది. జెప్ జెప్ (24) ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే బలమైన కోరిక ఉంది. కాని తండ్రి చేసిన ఘనకార్యం ఆయన ప్రేమ వివాహానికి ముందరి కళ్ల బంధంలా మారింది. జెప్ తండ్రి చుట్టు పక్కల ప్రాంతాల్లో 500 మంది మహిళలకు వీర్యదానం చేశాడు. ఆ విషయాన్ని వైద్యులు, తండ్రే స్వయంగా చెప్పడంతో జెప్ కు ప్రేమ మీద నమ్మకం పోయింది.

ఏ అమ్మాయిని చూసినా తన తండ్రి వీర్యానికి పుట్టినవారా అనే అనుమానం వెంటాడుతున్నది. ఎవరితోనూ ప్రేమగా ఉండేందుకు, డేటింగ్ చేసేందుకు వణికిపోతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక స్నేహితుడు ఒక వ్యక్తి గురించి చెప్పాడు. మెక్ లెనన్ కోలన్ తెలుసా, తెలిస్తే నీకు సోదరుడు అవుతాడని చెప్పాడు. మీ తండ్రి వీర్యంతో జన్మించాడని చెప్పగా, అతడు తనతో పాటు చదుకున్నాడని తెలుసుకుని జెప్ షాక్ షాక్ అయ్యాడు. ఇదే తరహాలో తన ఇంటి చుట్టు పక్కల 8 మంది వరకు చెల్లెళ్లలను గుర్తించానని, ఇంకా గుర్తించాల్సిన వారు ఉన్నారని వాపోతున్నాడు. సో తండ్రి చేసిన పనికి ఇతనికి ఇప్పట్లో పెళ్లయ్యే సూచనలు కన్పించడం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.