FbTelugu

విరాళమిచ్చి.. ఖర్చులు తగ్గించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరొక్క సారి తన యొక్క దాతృత్వ హృదయాన్ని చాటుకున్నారు. దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో తన సంవత్సర జీతంలో 30 శాతం పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ప్రకటించారు.

గతంలోనే తన నెలజీతాన్ని కూడా విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు రాష్ట్రపతి ఖర్చు తగ్గించే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆడంబరాలకు పోకుండా ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాలని, సభాసమావేశాలను స్వల్పస్థాయిలో అలంకరణలతనే నిర్వహించాని తీర్మాణించారు.

You might also like