FbTelugu

బుసలు కొడుతున్న డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన దేశంపై విరుచుకుపడుతున్నారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలకు జరిగిన నష్టానికి చైనా పరిహారం చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

ఇవాళ నార్త్ కరోలినాలోని రిపబ్లిక్ కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్ధేశించి ప్రసంగించారు. చాలా దేశాలు వ్యాక్సినేషన్ లో ముందున్నాయి, అమెరికాతో పాటు మిగిలిన దేశాలకు ఇప్పుడు సమయం ఆసన్నమైందన్నారు. కరోనాతో జరిగిన నష్టానికి వారు చైనా నుంచి పరిహారం కోరి. ఈ మహమ్మారికి కమ్యూనిస్టు పార్టీ ఆప్ చైనా బాధ్యత స్వీకరించాలి. కనీసం 10 ట్రిలియన్ డాలర్లకు తక్కువ కాకుండా పరిహారం ఇవ్వాలి. వారు చేసిన నష్టానికి ఇది చాలా స్వల్పం. ప్రపంచ దేశాలు అప్పలు ఉంటే చెల్లించవద్దని ట్రంప్ సూచించారు. ప్రపంచ దేశాలను ఆర్థికగా సర్వనాశనం చేసిందన్నారు.

ప్రస్తుత అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి మిలియన్ డాలర్లు తీసుకుని యుఎస్ ప్రజలకు అబద్దాలు చెప్పాడు. దేశంలోని ప్రముఖ కంపెనీలు, ఫేక్ మీడియా ఈయన సాయం గురించి పట్టించుకోలేదు. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం పన్నులు విధించాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తికి ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సాయం తీసుకున్నందున చైనా దేశం బైడెన్ ను ఏమాత్రం లక్ష్యపెట్టదని అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ అంటోని ఫౌచి మాస్కులు ధరించవద్దని చెప్పాడు. ఆ తరువాత మాట మార్చి, మాస్కులు ధరించాలని కోరారు. చివరకే ఆయనే పెద్ద మాస్కర్ అయ్యారు. వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం చెప్పకుండా ఫౌచి జీవితంలో అతిపెద్ద తప్పు చేశారని డోనాల్డ్ ట్రంప్ దుయ్యబట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.