FbTelugu

అప్పుడే క్షేత్రంలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్

నార్త్ కరోలినా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగానే తన ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నారు. 2024 లో మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటానని ఆయన శపథం చేసినట్లుగానే ప్రచార క్షేత్రంలోకి దిగారు.
డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తొలిసారి నార్త్ కరోలినా రాష్ట్రంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. రిపబ్లికన్లను నార్త్ కరోలిన్ రాష్ట్రం కంచుకోటగా ఉంది, ఇక్కడ 13సార్లు ఎన్నికలు జరగ్గా, 11సార్లు రిపబ్లిక్ అభ్యర్థులే విజయం సాధించారు.

ఒకసారి జిమ్మి కార్టర్, మరోసారి బరాక్ ఒబామా గెలుపొందారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. ఆదివారం నాడు వేలాది మంది రిపబ్లికన్లు, కార్యకర్తలతో నార్త్ కరోలినా రిపబ్లిక్ కన్వెన్షన్ లో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న 2024లో నార్త్ కరోలినాలో మరోసారి గెలిచి చూపిద్దామన్నారు. 2022 మధ్యంతర ఎన్నికల్లో తనకు విధేయంగా ఉండే అభ్యర్థలకు మాత్రమే మద్దతివ్వాలని ఆయన కోరారు. తాజాగా ఈ సమావేశం ద్వారా ట్రంప్ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టారు. ట్రంప్ మళ్లీ తన రాజకీయ చాతురతను మొదలుపెట్టారని అభిమానులు, కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.