FbTelugu

5 నగరాల నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్

ఢిల్లీ: మూడో దశ లాక్ డౌన్ 17వ తేదీతో ముగుస్తున్నందున డొమెస్టిక్ ఫ్లైట్లకు పచ్చ జెండా ఊపే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఫిజికల్ డిస్టాన్స్ పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేయడం లేదా ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ప్రయాణీకుడు స్వీయ రక్షణ పాటించేలా చర్యలు తీసుకోవాలనే యోచనలో కేంద్ర పౌర విమానయాన శాఖ ఉంది. దేశంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం విమానయాన రంగానికి కూడా మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఢిల్లీ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు స్పెషల్ ట్రైన్ రాకపోకలకు అనుమతించిన విధంగానే డొమెస్టిక్ ఫ్లైట్లకు అనుమతించవచ్చని అంటున్నారు.

డొమెస్టిక్ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలపై డీజీసీఏ, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, డీఐఏఎల్ అధికారులతో కూడిన కమిటీ ఢిల్లీ విమానాశ్రయంలో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసింది. తొలి దశలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చైన్నై విమానాశ్రయాల నుంచి డొమెస్టిక్ సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే ఈ ఫ్లైట్లలో ప్రయాణించేవారు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ మొబైల్ ఫోన్లలో కచ్చితంగా డౌన్ లోడు చేసుకుని వినియోగిస్తూ ఉండాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.