FbTelugu

డాల్ఫిన్ ను చంపేశారు…

లక్నో: సముద్రపు జీవి అనే కనికరం లేకుండా ఒక డాల్ఫిన్ ను అతి కిరాతకంగా చంపేశారు. దాన్ని రెండు ముక్కలుగా చేసి పైశాచిక ఆనందం పొందారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతాప్ ఘర్ జిల్లా కొతారియా గ్రామం సమీపంలో ఉన్న శారదా కాలువలో కొందరు యువకులు చేపల వేటకు వెళ్లారు. వలలో పెద్ద చేప చిక్కిందంటూ తొలుత మహానంద పడ్డారు. వలను బయటకు తీసుకువచ్చి చూడగా చేప కాకుండా డాల్ఫిన్ కనబడడంతో వారి ఆనందం ఆవిరైపోయింది.

దాన్ని తిరిగి కాలువలోకి వదిలేయకుండా దానిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. కత్తులు, కర్రలతో దాన్ని చావబాది, ఆ తరువాత రెండు ముక్కలు చేసి వదిలేశారు.
ఈ దారుణాన్ని ఒక యువకుడు తన ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను చూసిన స్థానిక పోలీసులు రంగంలోకి యువకులను గుర్తించి అరెస్టు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసి జైలుకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.