కృష్ణా: తాను రెండు మూడేళ్లుగా డోకిపర్రు రావాలనుకుంటున్నాని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన జిల్లాలోని డోకిపర్రులో శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి మాట్లాడారు.
వెంకటేశ్వర కల్యాణానికి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తనని అక్కడికి ఆహ్వానించిన కృష్ణరెడ్డి, పిచ్చిరెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామానికి వారు చేసిన సేవలు అభినందనీయమన్నారు. గ్రామంలో గ్యాస్ సరఫరా, తాగునీరు, రోడ్ల అభివృద్ధి బాగున్నాయని కొనియాడారు.