FbTelugu

‘చెయ్యి’జారుతున్న ఎమ్మెల్యేలు

గాంధీనగర్: గుజరాత్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీకీ ఎదురుదెబ్బ కొడుతున్నారు.

ఇప్పటికే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పెద్దలు 21 మంది ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించారు.

You might also like