FbTelugu

మార్చి నెలలో సూర్యప్రతాపం చూపిస్తుందా?

విశాఖపట్నం: గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలి పూర్తిగా తగ్గుముఖం పట్టి క్రమంగా ఎండలు పెరిగాయి.
సాధారణంగా మార్చి చివరి వరకు వాతావరణం చల్లగా ఉంటుంది. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పెరగడానికి వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ల ప్రభావం పెద్దగా లేకపోవడమే కారణంగా వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

డిసెంబరు నుంచి ఫిబ్రవరి/మార్చి వరకు వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ల ప్రభావంతో ఉత్తర, వాయువ్య భారతాల్లో వర్షాలు కురుస్తాయి. అటువంటిది ఈ ఏడాది వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ల ప్రభావం పెద్దగా లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. ఈ పరిణామంతో భూమి పొడిబారి తేమ ప్రభావం తగ్గుతుంది. దీంతో పాటు శీతల గాలులు కూడా తగ్గడంతో ఒక్కసారిగా భూమి వేడెక్కి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయని అంటున్నారు. ఉత్తర ఎగువ ప్రాంతంలో ఉన్న హిమాలయాల్లో వర్షాలు లేకపోవడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేంత వరకు దేశంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.