FbTelugu

కరోనా ఖర్చు ప్రభుత్వానికి తెలియదా?: విజయేందర్

హైదరాబాద్: కరోనా పేషెంట్ కు రోజుకు ఎంత ఖర్చు అయ్యేది ప్రభుత్వానికి తెలియదా ? అంటూ.. టీజేయూడిఏ మాజీ చైర్మన్ డా.పీఎస్.విజయేందర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా ట్రీట్మెంట్, చార్జెస్ వసూలుకి సంబందించిన GO.Rt.No.248 కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రజల సొమ్మును దోచిపెట్టేలాగే ఉందని అన్నారు. ఆస్పత్రిలో కరోనా పేషెంట్ కు ఒకరోజులో ఎన్ని పీపీఈ కిట్స్, మందులు అవసరం అవుతాయో ప్రభుత్వానికి తెలియదా? అయినా కేవలం అడ్మిషన్, వెంటిలేటర్, కొన్ని రకాల పరీక్షలకు చార్జెస్ మాత్రమే ఇచ్చి, మిగిలిన చార్జెస్ ని మినహాయించడమేంటని ప్రశ్నించారు.

ఇదీ కేవలం కార్పొరేట్ ఆసుపత్రులకు ఇష్టం వచ్చినట్లు బిల్లులు వేసే అవకాశం ఇవ్వడమేనన్నారు. నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమానికి కట్టుబడి వుంటే.. తక్షణమే రాష్ట్రంలో వున్న అన్ని ఆసుపత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని అందరికీ ఉచితంగా కరోనా ట్రీట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

You might also like