FbTelugu

తికమక జిల్లాలపై కెసిఆర్ స్పష్టత ఇచ్చేనా?

హైదరాబాద్: రాష్ట్రంలో ఒక శాస్త్రీయత లేకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత పది జిల్లాలు కాస్తా 33 జిల్లాలుగా పెరిగాయి. కాని పాలనాపరంగా ఏ విధమైన మార్పు రాలేదు.
ఇప్పటికీ జిల్లాల పెంపుదల కొనసాగుతునే ఉన్నది. ప్రజల సౌకర్యం జిల్లాలు ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ పాత జిల్లా పరిధికి తక్కువ, రెవెన్యూ డివిజన్ కు ఎక్కువ అనే విధంగా జిల్లాల పరిస్థితి ఉంది. జిల్లాల పేర్లను కూడా గజిబిజిగా పెట్టారు. సెంటిమెంట్ పేరుతో అర్థం లేని పేర్లను పెట్టి ప్రజల నాలుక తిరుగకుండా చేస్తున్నారు. ఉదాహారణకు యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు. వరంగల్ జిల్లాలో కూడా రెండు జిల్లాలకు ఒకేరకమైన పేర్లు ఉండడంతో ప్రజలు కొంత గందరగోళపడుతున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అని ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్ తీసేసి హనుమకొండ గా, వరంగల్ రూరల్ బదులు వరంగల్ గా మార్చాలని జిల్లావాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇంత వరకు వరంగల్ రూరల్ జిల్లాకు హెడ్ క్వార్టర్ ను ఖరారు చేయకుండా సాగదీస్తున్నారు.

వీటి పేర్లు మార్చాలని పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వి.వినోద్ కుమార్ కూడా పేర్లు మార్చాలని సిఎం కెసిఆర్ ను కోరారు. ఈ నెల 21వ తేదీన సిఎం కెసిఆర్ వరంగల్ నగరంలోని సెంట్రల్ జైల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మరో ప్రాంతంలో సెంట్రల్ జైలు నిర్మాణానికి శంకుస్థాపన కోసం వస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాల పేర్లు మార్పుపై సిఎం కెసిఆర్ చేత ప్రకటన చేయించడానికి దయాకర్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.