విశ్వనటుడు కమల్ హాసన్ తాజాగా తన కుటుంబ సభుయలతో దిగిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గురువారం కమల్ హాసన్ తన పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి తమిళనాడులోని స్వగ్రామంలో మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తీసిన కమల్ ఫ్యామిలీ ఫొటో ఒకటి బయటికి వచ్చింది. అందులో కమల్ అన్నయ్య చారుహాసన్, సుహాసిని , కమల్ కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్ కూడా ఉన్నారు.

కమల్ కుటుంబ సభ్యులతో నిండిన ఈ ఫొటోలో ‘విశ్వరూపం’ కథానాయిక పూజా కుమార్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హీరోయిన్‌ పూజా కుమార్ కమల్ హాసన్‌తో `విశ్వరూపం` రెండు భాగాల్లోనూ నటించింది. భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ నటిని ఇండియాకు తీసుకొచ్చింది కమలే కావడం గమనార్హం. పూజాతో సినిమాలు చేస్తున్నపుడే ఆమెతో కమల్ బంధం మీద రకరకాల ఊహాగానాలు వినిపించాయి. గౌతమికి కమల్ దూరమయ్యాక పూజా ఆయనకు చేరువైందని సమాచారం. గతేడాదిగా కమల్ హాసన్ ఏ ముఖ్య కార్యక్రమాలకు వెళ్లినా పూజా కుమార్ ‌ఆయనకు తోడుగా వెళుతూనే ఉంది. ఈ ఫోటో తరువాత విలక్షణ నటుడు కమల్ హాసన్ మళ్లీ ప్రేమలో పడినట్లు కోలీవుడ్ వర్గాలు. గుసగుసలాడుతున్నాయి.