FbTelugu

ఆర్కాడు పంచాంగం చెప్పినట్లు జరుగుతుందా?

చెన్నై: ఆర్కాడు పంచాంగం ఈ ఏడాది కూడా కరోనా వైరస్ వల్ల కలిగే నష్టాలను వెల్లడించింది. గతేడాది ప్రజలను వైరస్ అష్టకష్టాలు పెట్టిన విధంగానే ఈ ఏడాదిలో కూడా నష్టాల పాలు చేస్తుందని చెప్పింది.

ఆర్కాడు పంచాంగం ఈ ఏడాది కూడా వైరస్‌ వ్యాప్తిపై కొత్త సంగతులను ప్రకటించింది. పంచాంగంలో పేర్కొన్నట్టే గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా సెకండ్ వేవ్ కరాళనృత్యం చేస్తున్న వేళ  తమిళ ఉగాది సందర్భంగా వెలువడిన ఆర్కాడు పంచాంగంలో వైరస్‌ రెండో దశ వ్యాప్తిని గురించి వివరాలు పొందుపర్చారు.

వచ్చే నెల మే, జూన్‌ మాసాల్లో వైరస్‌ ఉగ్రరూపం దాల్చి ప్రజలకు నిద్రహారాలు కరవు చేస్తుందని, ఆర్థికంగా పలు కుటుంబాలు చితికిపోతాయని పేర్కొంది. రెండు నెలల విజృంభణ తరువాత సెప్టెంబర్‌ నుంచి వైరస్‌ పూర్తిగా కట్టడిలోకి వస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుందని ఆ పంచాంగంలో తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.