నిజామాబాద్: ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిజామాబాద్ గవర్నమెంటు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర్ రావు రాజీనామా చేశారు.
రాజీనామా లేఖను వాట్సప్ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు పంపించారు. ఆక్సీజన్ సిలిండర్ల కొరత కారణంగా నలుగురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
కరోనా విజృంభిస్తున్న సమయంలో సిలిండర్లు కావాలని ఆయన పలుమార్లు ఉన్నతాధికారులను కోరారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో చేసేది లేక ఆయన మిన్నకుండి పోయారు. ఆక్సీజన్ కొరతతో వరుసగా నలుగురు రోగులు ప్రాణలు విడిచారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు డా.నాగేశ్వర్ రావు ప్రకటించారు.