FbTelugu

ఆ డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు రూ.10

హైదరాబాద్: ఆయన రూ.10 మాత్రమే కన్సల్టెన్సీ ఫీజు తీసుకుని కరోనా రోగులకు మందులు రాస్తున్నారు. నిరుపేదలు అయితే ఉచితంగా చికిత్స చేస్తున్నారు. ఆయనే డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యుయేల్.

ఇదే కాకుండా కరోనాకు సంబంధించిన పరీక్షలు కూడా తక్కువ ధరకే చేస్తున్నారు. కరోనా వైద్య పేదలు, మధ్యతరగతి ప్రజల పాలిట శాపంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలో డాక్టర్ విక్టర్ ప్రజ్వల క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఎంబిబిఎస్ చేసిన తరువాత జనరల్ మెడిసిన్ చేశారు. పలు ఆసుపత్రులలో పనిచేసిన తరువాత సీనియార్టీ రావడంతో స్వంతంగా ఫిర్జాదిగూడలో సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు స్థోమత కలిగిన వారి నుంచి రూ.200 కన్సల్టెన్సీ ఫీజు వసూలు చేస్తున్నారు. పేద రోగుల నుంచి మాత్రం రూ.10 తీసుకుంటున్నారు. దేశం కోసం పోరాడే సైనికులు, రైతులు, అనాధలు, దివ్వాంగులకు వ్యాధి తగ్గే వరకు ఉచితంగా చికిత్స చేస్తున్నారు. కరోనా సోకితే ల్యాబ్ పరీక్షలు మొదలు మందులు, ఇంజెక్షన్లు తక్కువ ధరకే ఇస్తున్నారు.

కరోనా చికిత్సలో కీలకమయ్యే ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లను కూడా కంపెనీ రేట్లకే సమకూర్చుతున్నారు. ఇంటి వైద్యం చేసుకునేవారికి కూడా మందులు ఇస్తూ, నర్సులను సమకూర్చుతున్నారు. మొత్తంగా కరోనా చికిత్స కోసం రూ.15వేలకు మించకుండా చూస్తున్నారు. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్ లో ఏడాదిగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.