అమరావతి: రాష్ట్రంలో 35 ఏళ్లకు పైబడి వయస్సు ఉన్న వాలంటీర్లను ఇంటికి పంపించాలని వార్డు వాలంటీర్ కమిషనర్ జీఎస్.నవీన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లాలో కలకలం రేపుతున్నాయి.
వాలంటీర్లుగా పనిచేస్తున్న వారిలో 18ఏళ్ల లోపు ఉన్నవారిని, 35 ఏళ్లు పైబడిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో నవరత్నాల పథకాల అమలు కోసం వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను నియమించింది. 50 ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం 2.60 లక్షల మందిని నియమించారు. కొందరు వైసీపీ నాయకుల సిఫారసు మేరకు నియమించారు. వీరిలో చాలా మంది 35 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. వీరిని తొలగించి కొత్తవారిని నియమించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.