FbTelugu

డాక్టర్ ను సస్పెండ్ చేస్తారా: బాబు

విశాఖపట్నం: నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ అనస్థియా డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు స్పందించారు.

ఎన్-95 మాస్కులు లేవన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తే.. సమస్యను పట్టించుకోకుండా డాక్టర్‌ను సస్పెండ్ చేస్తారా అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ చర్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

కరోనా రోగులకు చికిత్స చేస్తూ, ముందుండి పోరాడుతున్న డాక్టర్లను ఇలా అగౌరవ పరిస్తే ఎలా అని అన్నారు. ఇలాంటి సమయంలో వైద్యులను, వైద్య సిబ్బందిని జాగ్రత్తగా కాపాడుకోవలని ఆయన సూచించారు.

You might also like