FbTelugu

తప్పులు బయటపడతాయనే అడ్డుకుంటున్నారా? : భట్టి

హైదబాద్: తమ తప్పులు బయటపడతాయనే టీఆర్ఎస్ పెద్దలు కాంగ్రెస్ తలపెట్టిన జలదీక్ష (పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన) కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారా.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్య పాలన లేదని అన్నారు.

ప్రతిపక్షంపై తీవ్రంగా కుట్ర జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 33 లక్షల 20 వేల ఎకరాలకు నీందుతుందని అన్నారు. వీటికి అయ్యే ఖర్చు రూ.31 వేల 848 కోట్లు మాత్రమేనని అన్నారు. అయితే కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో రూ.1లక్షా 32 వేల 600 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఇంత ఖర్చు చేస్తే ఆయకట్టు 21 లక్షల 28 వేల 853 ఎకరాలేనన్నారు. ఇలా చూస్తే గతంలో ప్రారంభించిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాలు ఎక్కువే సాగులోకి వస్తుందన్నారు. అదనంగా ఖర్చు చేస్తున్న లక్ష కోట్లు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు.

You might also like