FbTelugu

కరోనా దేవీ ఆలయం ఎక్కడుందో తెలుసా?

చెన్నై: తమిళనాడులో ప్రజలు ఏదైనా ఒక విషయంలో పిచ్చిగా ఆరాధిస్తారు. కోపమొస్తే అంతే తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కరోనా విలయతాండవం నేపథ్యంలో కరోనా దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.

కరోనా వచ్చింది అంటున్నారు కాని వచ్చాడు అనకపోవడంతో కరోనా వైరస్ ఆడది అనేదానికి నిర్థారణకు వచ్చారు. దేశ వ్యాప్తంగా కరోనా అంతకావాలంటూ పూజలు చేస్తుండగా ఇక్కడ మాత్రం ఏకంగా కరోనా దేవీ విగ్రహాన్ని నిత్యం పూజలు చేస్తున్నారు. కోయంబత్తూరు కామాక్షి పురి ఆలయంలో ఒకటిన్నర అడుగుల ఎత్తున్న కరోనా దేవీ విగ్రహాన్ని ప్రతిష్టించడం విశేషం. ఆలయ పూజారులు మరో నిర్ణయం తీసుకున్నారు. 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వమించి మహాయాగం చేయనున్నారు. ఈ సమయంలో ఆలయంలోకి ఎవరిని అనుమతించడం లేదని ప్రకటించారు. ఇంతకు ముందు తట్టు, కలరా అంటు వ్యాధులు ప్రభలిన సమయంలో మరియమ్మన్, బ్లాక్ మరియమ్మన్, మలియమ్మన్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.