FbTelugu

టిక్ టాక్ పై నిషేధం తొలగింపు ఎక్కడో తెలుసా?

వాషింగ్టన్: దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లిందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా యాప్ లను నిషేధించగా అధికారంలోకి వచ్చిన నూతన అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ ఎత్తేశారు. ఈ నిర్ణయంతో అమెరికాలో మళ్లీ చైనా యాప్స్ హవా కొనసాగనున్నది.

టిక్ టాక్, వి చాట్ సహా ఎనిమిది సాఫ్ట్ వేర్ లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. సమాచార భద్రత కోసం యుఎస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీసెస్ సప్లై చైన్ ఎగ్జిక్యుటివ్ ఆర్డర్ పై ఆమోదముద్ర వేశారు. అమెరికా యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్, వి చాట్ వంటి చైనా యాప్ లను 2020 లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంస్థల కార్యకలాపాలు అమెరికాలో నిర్వహించకుండా నిషేధించారు. ఇదే కాకుండా 59 చైనా సైనిక, నిఘా సంస్థలు అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా నిషేధించారు. కరోనా వైరస్ మూలాలను చెప్పేందుకు చైనా నిరాకరించడం, వూహాన్ ల్యాబ్ గుట్టుముట్టు విప్పేందుకు చైనా సహకరించకపోవడంతో ట్రంప్ అప్పట్లో కఠిన నిర్ణయం తీసుకున్నారు. గల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా అకారణంగా దాడి చేయడంతో కేంద్ర ప్రభుత్వం కూడా టిక్ టాక్ సహా పలు యాప్ లను నిషేధించింది. రోడ్డు పనులు నిషేధించడమే కాకుండా 5జి టెక్నాలజీలో చైనా కంపెనీల ప్రమేయాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ నిషేధం ఇంకా దేశంలో అమలవుతునే ఉన్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.