FbTelugu

క‌రోనాతో స‌హ‌జీవ‌నం అంటే ఏమిటో తెలుసా!

దేశంలో ల‌క్ష కేసులు దాటాయి. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వేల‌కు పైగా న‌మోద‌య్యాయి. లాక్‌డౌన్‌తో జ‌నం మాన‌సికంగా, ఫైనాన్షియ‌ల్‌గా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో స‌హ‌నం కోల్పోయి ఎక్క‌డ ఎదురుతిరుగుతార‌నే భ‌యం కూడా నెల‌కొంది. అందుకే రాష్ట్రాలు కూడా దైవంపై భార‌మేసి ఆంక్ష‌లు మెల్ల‌మెల్ల‌గా స‌డలిస్తున్నాయి. మొద‌ట్లో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్న మాట‌లు ఇప్పుడు అంద‌రూ ఆమోదిస్తున్నారు.

క‌రోనా వైర‌స్ క‌ల‌సి జీవించాలనే విష‌యాన్ని న‌చ్చ‌క‌పోయినా అంగీక‌రిస్తున్నారు. క‌రోనాతో ఉండ‌టం అంటే రోగంతో బాధ‌ప‌డ‌టం అని కాదు. జ్వ‌రం, జ‌లుబు, త‌ల‌నొప్పి, టైఫాయిడ్‌, మ‌లేరియా ఇలా సాధార‌ణ జ‌బ్బులు మాదిరిగానే క‌రోనా అన‌బ‌డే కొవిడ్ 19 వైర‌స్ శ‌రీరానికి సోకుతుంద‌ని అర్ధం. భార‌తీయుల్లో స్వ‌త‌హాగా ఉండే ఇమ్యూనిటీ సిస్ట‌మ్ చాలా రోగాల‌ను ద‌రిచేర‌కుండా ర‌క్ష‌ణ‌గా ఉంటుంద‌నేది ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం.

మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌లోనే అది దాగుంది. ప‌సుపు, కారం, అల్లం, వెల్లుల్లి ఇలా చెప్పుకుంటూ పోతే.. గృహిణుల పోపుల పెట్టేలోనే వైర‌స్‌ను ఎదిరించే అస్త్రశస్త్రాలు దాగుతాయ‌నేది వారి అభిప్రాయం. ఆయుర్వేద మందుల్లో ఉప‌యోగించే అశ్వ‌గంధ‌, ఉసిరి వంటివి వైర‌స్‌తో తేలిక‌గా పోరాడుతున్నాయంటూ ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌ల్లోనూ వెల్ల‌డైంది. కాబ‌ట్టి…. సాధార‌ణ జ్వరం మాదిరిగానే క‌రోనా ఇలా వ‌చ్చి.. ఒంట్లో శ‌క్తి చేరేంత వ‌ర‌కూ ఉండి త‌గ్గిపోతుంద‌నేది వైద్యులు ఇండియ‌న్ల‌కు ఇస్తున్న భ‌రోసా.

మామూలుగానే జ‌లుబు చేసిన వ్య‌క్తిప‌క్క‌న న‌లుగురైదుగురు ఉంటే.. వారిలో ఎవ‌రైతే వెంట‌నే జ‌లుబు భారిన ప‌డ‌తారో వారిలో ఇమ్యూనిటీ త‌క్కువ‌గా ఉన్న‌ట్టు వైద్యులు అంచ‌నా వేస్తుంటారు. ఇప్పుడు క‌రోనా విష‌యంలోనూ వైర‌స్ సోకి ఇబ్బంది ప‌డుతున్న బాధితుల్లో వ్యాధి నిరోధ‌క‌శ‌క్తి అదేనండీ.. ఇమ్యూనిటీ త‌గ్గింద‌ని అనుకోవాలి. తిరిగి శ‌రీరానికి అవ‌స‌ర‌మైన శ‌క్తిని ఆహారం, వ్యాయామం, యోగ‌, ప్రాణాయామం, మాన‌సిక దృఢ‌త్వం ద్వారా అందించ‌గ‌లిగితే కోలుకోవ‌టం సులువు అనేది వైద్యుల సూచ‌న‌.

You might also like