FbTelugu

ప్రిన్స్ హ్యారీకి తల్లి ఇచ్చిన ఆస్తి ఎంతో తెలుసా?

లండన్: బ్రిటీష్ రాజకుటుంబం నుంచి వేరు పడి సాధారణ జీవితం గడుపుతున్న ప్రిన్స్ హారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ ఆస్తిపై చర్చ జరుగుతోంది. లండన్ బకింగ్ హమ్ ప్యాలెస్ వదిలి వీళ్లు అమెరికాలో సాధారణ పౌరులుగా జీవిస్తున్నారు.
రాచరిక కుటుంబంలో వర్ణ వివక్ష ఉందని, ఇమడలేకే బయటకు వచ్చామని మేఘన్ మార్కెట్ చేసిన ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆర్థికంగా బకింగ్ హమ్ ప్యాలెస్ పై ఆధారపడడం లేదని ప్రిన్స్ ప్రకటించారు.

తన తల్లి డయానా ఇచ్చిన సంపదతోనే జీవిస్తున్నామని, ఆ సంపద లేకపోతే ఈ పని చేసేవాళ్లం కాదని హ్యారీ చెబుతున్నాడు. ఈ ప్రకటనతో గూగుల్ పలువురు ప్రిన్స్ హ్యారీ ఆస్తి ఎంత అనే అంశంప తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ ప్రశ్నలు టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. హ్యారీకి తన తల్లి డయానా వదిలివెళ్లిన నగదు 89 లక్షల డాలర్లు. ఆమె చనిపోయిన తరువాత ఆ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టగా ఇప్పుడది 1.3 కోట్ల డాలర్లకు చేరింది. హ్యారీ అన్న ప్రిన్స్ విలియమ్ కు 90 లక్షల డాలర్లు కేటాయించింది.
ఈ డబ్బులు ఉండడంతోనే ప్రిన్స్ హ్యారీస్ రాజకుటుంబం నుంచి బయటకు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ప్రముఖ డిజిటల్ యాంకర్ ఓఫ్రా విన్ ఫ్రే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఇద్దరు మాట్లాడారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.