FbTelugu

హౌస్ ఫుల్ బోర్డులు ఎక్కడో తెలుసా?

న్యూఢిల్లీ: హౌస్ ఫుల్ బోర్డులు మనకు సినిమా థియేటర్లలో కన్పిస్తాయి. కరోనా సమయంలో అవి కూడా కన్పించడం లేదు. అయితే కరోనా మహమ్మారి సమయంలో సీన్ రివర్స్ అయ్యింది.

పలు నగరాల్లో స్మశాన వాటికల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కన్పిస్తుండడంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కంగుతింటున్నారు. కొన్ని నగరాల్లో అయితే ప్రతి ఐదు నిమిషాలకో శవం వస్తుండడంతో వారిని కాల్చేందుకు కాటికాపర్లు నానా తంటాలు పడుతున్నారు. వరుసగా శవాలు రావడం, కాల్చేందుకు కట్టెలు అందుబాటులో లేకపోవడం, క్యూ ఎక్కువగా ఉండడంతో హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నారు. ఆఖరికి చనిపోయిన వ్యక్తి దేహం కూడా కాల్చేందుకు స్థలం లభ్యం కావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. బెంగళూరులో కొన్ని స్మశాన వాటికల్లో రెండు మూడు రోజుల పాటు జాగారం చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.