FbTelugu

జియో 5జి స్పీడ్ ఎంతో తెలుసా?

ముంబయి: దేశంలో 5జి టెక్నాలజీ ప్రయోగ సమయంలో 1జిబిపిఎస్ వేగాన్ని తాకినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబాని ప్రకటించారు. పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతికతో 5జి సేవలను ప్రారంభించిన మొదటి నెట్ వర్క్ జియో అని ఆయన తెలిపారు.
ఇవాళ జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షక సర్వసభ్య సమావేశంలో జియో 5జి గురించి ప్రకటించారు. గూగుల్ సహకారంతో కొత్త ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను అభివృద్ధి చేసినట్లు ముకేశ్ తెలిపారు. సెప్టెంబర్ 10న గణేష్ చతుర్ధి రోజున మార్కెట్ లోకి కొత్త 5జి ఫోన్లు రానున్నాయని వెల్లడించారు.

జియో 5జి కోసం గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం తీసుకున్నట్లు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ సహాయంతో 10 ఎండబ్ల్యూ సామర్థ్యంతో జియో-అజూర్ క్లౌడ్ డేటా సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నూతన టెక్నాలజీతో ఆరోగ్య సంరక్షణ, విద్య, వినోదం, రిటైల్ రంగాలో పెనుమార్పులు వస్తాయన్నారు. అదే విధంగా 5వేల లోపు 5జి ఫోన్ తీసుకువస్తున్నట్లు సూచనప్రాయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో జియోకు 42.50 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. 5జి సాంకేతికతతో కొత్తగా 20 కోట్ల మందిని చేర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జి ఫోన్ నే వాడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.