FbTelugu

తిరుమల హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమల: కరోనా సెకండ్ వేవ్ తో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ తగ్గింది. ఫలితంగా హుండీ ఆదాయం కూడా పడిపోయింది. నిన్న మే 6వ తేదీన స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు రూ.30  లక్షలు మాత్రమే.

నిన్న 6,011 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, శ్రీవారికి 2,846 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. టిటిడి తిరుపతిలో ప్రతి రోజు  ఇస్తున్న సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో టైమ్ స్టాట్ టోకన్ల జారీ ఆపేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.