FbTelugu

ఆర్టీసీ సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా ?: హైకోర్టు

Do-you-intend-to-solve-the-RTC-issue-asks--High-Court

హైదరాబాద్: ఆర్టీసీ సమస్యను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అని హైకోర్టు ప్రభుత్వం పై సీరియస్ అయింది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ, ఆర్టీసీ కార్మికుల తీరుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.సెక్షన్ 47ఏ పైనే హైకోర్టులో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోలేదా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించింది.

ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం వలనే సమ్మె కొనసాగుతోంది. దీంతో ప్రజలు 34 రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రూ. ​వేల కోట్లు పెట్టి ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్న ప్రభుత్వం.. సమస్యలో ఉన్న ప్రజలకు రూ47 కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నించింది. ​ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ప్రజల కోసం ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదా?.

You might also like