ముంబై: అర్ధరాత్రి ఒంటిగంట నుంచి 3 గంటల మధ్యలో యూపీఐ పేమెంట్స్ చేయొద్దు అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) స్పష్టం చేసింది.
సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేస్తుండడం మూలంగా ఆ సమయంలో చెల్లింపులపై ప్రభావం ఉంటుందని ప్రకటించింది.
అయితే అది ఎన్ని రోజుల వరకు ఉంటుందనేది మాత్రం ఎన్పీసీఐ స్పష్టం చేయలేదు. కొన్ని బ్యాంకులను విలీనం చేయడం, బ్యాంకు బ్రాంచీలను కూడా విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతుండడంతో సంబంధిత బ్యాంకులు కూడా సాఫ్ట్ వేర్ లతో పాటు యాప్ లను, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సైట్లను కూడా అప్ గ్రేడ్ చేస్తున్నాయి.