FbTelugu

తుఫాన్ పై రాజకీయం చేయను: పవన్

కృష్ణా: తుఫాన్ ప్రభావం రైతుల ను నట్టేట ముంచిందని, చేతికంది వచ్చిన పంట చేజారిపోవడం బాధాకరంగా ఉందని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీకు అండగా ఉండలానే మీ దగ్గరకు వచ్చాను.. ప్రకృతి వైపరీత్యాలు ను రాజకీయం చేయనని ఆయన పేర్కొన్నారు.

పామర్రు నియోజకవర్గం లో పంట పొలాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఓట్ల సమయంలోనే వచ్చి వెళ్లే వ్యక్తి ని కాను.. ఇప్పుడు ఎన్నికలు లేవన్నారు. ప్రజల బాధలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకే వచ్చానన్నారు. కష్టించి పండించిన పంట మొత్తం దెబ్బ తిన్నదని, సొంత భూమి రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతుల కన్నీళ్లు మన దేశానికి మంచిది కాదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తిగా రైతాంగాన్ని అదుకోవాలన్నారు. కర్షకుల కష్టాలు, కన్నీళ్లను కేంద్రం దృష్టి కి తీసుకెళతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.