అమరావతి: విశాఖపట్నం కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గెస్ట్‌హౌస్ నిర్మాణంపై హైకోర్టు కీలక ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. గెస్ట్‌హౌస్‌కు కేటాయించిన 30 ఎకరాల్లో చెట్లు నరకవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాపులుప్పాడ కొండపై అతిథిగృహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ… అమరావతి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. గ్రేహౌండ్స్‌కు ఇచ్చిన స్థలంలో గెస్ట్‌హౌస్ నిర్మాణం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. గ్రేహౌండ్స్ నక్సల్స్, టెర్రరిస్ట్ వ్యతిరేక దళం, రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదప్రతివాదనల తరువాత గెస్ట్‌హౌస్‌కు కేటాయించిన 30 ఎకరాల్లో చెట్లు నరకవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని సూచించింది.