FbTelugu

కాపు ఉద్యమం చేయను: ముద్రగడ స్పష్టీకరణ

కాకినాడ: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం కాపు రిజర్వేషన్ ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం కొద్ది రోజుల క్రితం ఆ ఉద్యమం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాపు రిజర్వేషన్లపై జగన్ ప్రభుత్వం ఏమీ తేల్చకపోవడంతో ఉద్యమం చేయాలని కాపు కులం వాళ్లు ముద్రగడపై ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యమం నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కూడా. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కాపు కులం వాళ్లు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్నారు.

ఉద్యమంపై సుమారు అర గంట పాటు ఆయన తో చర్చించారు. కొద్ది రోజుల క్రితమే ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాను, ఈరోజు కూడా అదే చెబుతున్నాను అని ముద్రగడ వారితో స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన కూడా చేశారు. ముద్రగడ స్థానంలో కొత్తవారిని ఎన్నుకుంటారా లేదా మరికొన్ని రోజుల్లో స్పష్టత రానున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.