FbTelugu

జూలై వరకు ఆఫీసుకు రావొద్దు: టెక్ కంపెనీలు

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ఇప్పట్లో తగ్గుముఖం పట్టే పరిస్థితులు లేకపోవడంతో పలు కంపెనీలు ఆఫీసులకు మరికొన్ని నెలలు తాళాలు వేయనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ను కొనసాగించాలని నిర్ణయించాయి.

అమెరికా కు చెందిన ప్రముఖ క్లౌడ్ బెస్డు సాఫ్ట్ వేర సంస్థ ‘‘సేల్స్ ఫోర్స్’’ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే ఏడాది జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఈ విధానాన్ని అనుసరించింది. అయినా వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడంతో వచ్చే ఏడాది వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇళ్ల నుంచి పనిచేసే వారికి కుర్చీ, టేబుల్ కొనుగోలు చేసుకునేందుకు రూ.18,750 మంజూరు చేసింది. ప్రముఖ టెక్ కంపెనీలు అయిన గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ను వచ్చే ఏడాది వరకు పొడిగించాయి.

You might also like