FbTelugu

రైతుల డిమాండ్లు ఒప్పుకోము: అమిత్ షా

న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని, వీటిపై రైతులకు నచ్చచెబుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుండబద్దలు కొట్టి చెప్పారు.
కనీస మద్ధతు ధరపై రైతులకు భరోసా ఇస్తామని ఆయన అన్నారు. రైతుల ఆందోళన న్యూఢిల్లీలో కొనసాగుతున్న నేపథ్యంలో అమిత్ పై విధంగా స్పందించారు. మార్కెట్ కమిటీలు, కనీస మద్దతు ధరపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు భరోసా కల్పిస్తామన్నారు. ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలో చర్చలు జరగనున్నాయని ఆయన తెలిపారు.

ఇంతకు ముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నరేంద్ర తోమర్, రాజ్ నాథ్ సింగ్ సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రైతులతో మాట్లాడాల్సిన తీరుపై చర్చించుకున్నారు. రైతులను ఆందోళన విరమించే దిశగా చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.