FbTelugu

కుక్క కోసం డీఎన్ఏ టెస్టు!

భోపాల్: భార్య, భర్తల మధ్య విభేధాలు వచ్చిన సందర్బాల్లో మాత్రమే డీఎన్ఏ టెస్టులు నిర్వహించడం విన్నాం. ఈ టెస్టులో భర్త ద్వారా జన్మించాడా లేదా అనేది వెల్లడి అవుతుంది.

ఆయనకు పుట్టిన సంతానమే అంటూ మాజీ గవర్నర్ ఎన్డీ.తివారిపై ఒక మహిళ ఫిర్యాదు చేసి, డీఎన్ఏ టెస్టు కోసం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు దేశంలో అక్కడక్కడా జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఒక పెంపుడు కుక్క కోసం ఇద్దరి వ్యక్తుల మధ్య వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కుక్క కు డీఎన్ఏ టెస్టు నిర్వహించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

భోపాల్ లో నివసిస్తున్న సాహెబ్ ఖాన్ కుక్క కొన్ని రోజులుగా కన్పించడం లేదు. ఏబీవీపీ నేత కార్తీక్ కూడా తన కుక్క కన్పించడం లేదని పోలీసులను ఆశ్రయించాడు. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు వాటి కోసం వెతకడం ప్రారంభించారు. మొత్తానికి దాని ఆచూకి లభించింది, ఈ కుక్క తనదంటే తనదని ఇద్దరూ వాదించారు. మూడు నెలల క్రితం కొనుగోలు చేశానని, దాని పేరు కోకోగా పెట్టుకున్నట్లు సాహెబ్ తెలిపాడు. దాన్ని చూసిన తరువాత, ఈ కుక్క తనదేనంటూ కార్తీక్ తెలిపాడు. నాలుగు నెలల క్రితం కొన్నానని, దాని పేరు టైగర్ అని చెప్పాడు. విచిత్రమేమంటే కోకో అని పిలిచినా, టైగర్ అని అరిచినా అది ఏమాత్రం స్పందించలేదు.
వీరిద్దరి తగవు తీర్చేందుకు డీఎన్ఏ టెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించారు. పరీక్షల తరువాత అసలైన యజమాని ఎవరనేది బయటపడుతుందని అంటున్నారు. అయితే ఈ అంశంపై వచ్చిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారడంతో పోలీసులకు తలనొప్పిగా తయారైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.