FbTelugu

విద్యా రుణాలు రద్దు చేస్తాం: స్టాలిన్ ప్రకటన

ఈరోడ్: తాము అధికారంలోకి రాగానే విద్యా రుణాలను రద్దు చేస్తామని డీఎంకే అధినేత ఎంకె.స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిదినాలుకల్పించడంతో కూడా నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. ఉపాధి హామీ పనిదినాలు వంద రోజుల నుంచి 150 రోజుల వరకు పెంచేందుకు కేంద్రం పై ఒత్తిడి పెంచుతామని స్టాలిన్ హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.