FbTelugu

వరుస హత్యల కేసులో.. విస్తుపోయే నిజాలు

చిత్తూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్య, అలేఖ్య వరుస హత్యల కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అతి మూఢనమ్మకాలతోనే రెండు హత్యలు జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

మొదట చిన్న కుమార్తె దివ్యను పెద్ద కుమార్తె అలేఖ్య డంబెల్ తో కొట్టి హత్య చేయగా.. అలేఖ్యను తల్లి పద్మజ డంబెల్ తో కొట్టి చంపింది. అలేఖ్య హత్య అనంతరం ఆమె నాలుకను పద్మజ కోసి తిన్నట్టుగా పద్మజ భర్త పురుషోత్తం నాయుడు వైద్యులకు చెప్పినట్టు సమాచారం. అయితే అది నిజమా అబద్దమా అనే విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని వైద్యులు స్పష్టం చేశారు. పద్మజ, పురుషోత్తం ఇద్దరిలోనూ మానసిక వ్యాధి లక్షణాలు ఉండడంతో వారిని విశాఖపట్టణంలోని ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి సిఫారసు చేసినట్టు తిరుపతిలోని రుయా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.