FbTelugu

విడాకుల కేసు వెనక్కి… భర్తే కావాలంటున్న భార్య

ముంబయి: విడాకుల నోటీసులు ఇచ్చిన భార్య తాజాగా తన భర్త తనకే కావాలంటూ నోటీసులు వెనక్కి తీసుకున్నది. ఆమె హీరో నవాజుద్దిన్ సిద్ధిఖీ భార్య అంజలీ కిషోర్ పాండే అలియాస్ అలియా.

నవాజుద్దిన్ సిద్ధిఖీ 2009లో అంజలీ కిషోర్ పాండే ను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె కలిగారు. ఈ మధ్య భర్తపై పలు ఆరోపణలు చేసిన అంజలి విడాకుల నోటీసులు కూడా పంపించింది. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో సహజీవనం చేస్తున్నాడని, స్త్రీలోలుడు అని బహిరంగంగా విమర్శలు గుప్పించింది. ఆయనపై రేప్ కేసుతో పాటు మానసికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది. ముంబై వెర్సోవా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. ఈ కేసు అనేక మలుపులు తిరిగ్గా, అంజలీ కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో కథ సుఖాంతం అయ్యింది.

తనకు భర్తే కావాలని, ఆయనతోనే జీవిస్తానని అంజలీ స్పష్టం చేసింది. ఆయనపై ఇప్పటి వరకు చేసిన ఆరోపణలు మర్చిపోతానని, కలిసి ఉంటామని పోలీసులకు చెప్పింది. ఆయనలో మార్పు రావడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని ఆమె వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.