FbTelugu

దివిస్ కంపెనీ బండారం విప్పుతాం: నాదెండ్ల మనోహర్

కాకినాడ: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి దివిస్ కంపెనీ ని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పారని, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ అని ప్రచారం చేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ తెలిపారు.

జగన్ సీఎం కాగానే ఎందుకు మాట తప్పారు, మడమ తిప్పారని ఆయన నిలదీశారు. ఎందుకు తూర్పు గోదావరి ప్రాంతవాసులను ఇలా బాధపెడుతున్నారని నాదెండ్ల మనోమర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ క్యాబినెట్ సమావేశంలో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందన్నారు. కేబినెట్ సమావేశంలో కాకినాడ సెజ్ కోసం సేకరించిన 2600 ఎకరాలు తిరిగి రైతులకే ఇస్తామని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఆ రోజు తీసుకున్నది 10వేల ఎకరాలు అని, నష్టపరిహారం కూడా అప్పట్లో రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చారన్నారు. ఇదంతా ప్రణాళిక బద్ధంగా దోచుకోవడానికేనని మనోహర్ అన్నారు.

ప్రధానంగా దివిస్ కంపెనీ విషయంలో జనసేన పార్టీ పూర్తి వివరాలతో పోరాడుతుందని అన్నారు. దివిస్ వెనకాల జరుగుతున్న కుట్రలను పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో బయటపెడ్తారని ఆయన స్పష్టం చేశారు. ఈబీసీ మహిళలకు ఏడాదికి రూ.15వేలు సాయం చేస్తామని చెబుతున్నారు కాని ఈబీసీ రిజర్వేషన్ల అమలు విషయాన్ని చెప్పడం లేదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.