FbTelugu

దివాకర్ ట్రావెల్స్ 8 బస్సులు సీజ్

Divakar-Travels-8-buses-Siege

అనంతపురం: దివాకర్‌ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగించారు. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో పలు నిబంధనల అతిక్రమణలు జరుగుతున్నాయన్న సమాచారంపై ఈ తనిఖీలు చేస్తున్నట్టు డీటీసీ శివరాంప్రసాద్‌ తెలిపారు. ఈ తనిఖీలు తెల్లవారుజామున 5నుంచే అనంతపురం నగరంతోపాటు హిందూపురం, గుంతకల్లు ప్రాంతాల్లో నిర్వహించారు. అనంతపురం నగరంలోని బళ్లారి రోడ్డు, కళ్యాణదుర్గం రోడ్డు ప్రాంతాల్లో డీటీసీ శివరాంప్రసాద్‌, ఇన్‌చార్జి ఆర్‌టీఓ వరప్రసాద్‌, ఎంవీఐలు అతికనాజ్‌, దామోదర్‌నాయుడు తనిఖీలు చేశారు. అనంతపురం నగరంలో 4, గుంతకల్లులో 4.. మొత్తం 8 బస్సులు సీజ్‌ చేశారు. అనంతపురం- బెంగళూరు, అనంతపురం-బళ్లారి, అనంతపురం- సిర, గుంతకల్లు- బళ్లారి రూట్లలో తిరిగే దివాకర్ బస్సుల్లో పలు నిబంధనలు అతిక్రమిస్తున్నందుకే ఆయా బస్సులను సీజ్‌ చేశామని స్పష్టం చేశారు.

You might also like