గుంటూరు: కోటప్పకొండ తిరునాళ్ళపై వస్తున్న తప్పుడు వార్తలు పూర్తిగా నిరాధారమని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. కొన్ని వార్త పత్రికలు, టీవీ చానళ్లలో ప్రభలపై ఆంక్షలు విధించారని వస్తున్న వార్తలను ఖండించారు.
ప్రతి సంవత్సరం సంప్రదాయ బద్దంగా ఏర్పాటు చేసే ప్రభలకు సంబంధించి పోలీస్ అధికారులు ఏటువంటి ఆంక్షలు విధించలేదని ఎస్పీ విశాల్ గన్ని తెలిపారు. మునిసిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో శాంతి భద్రతలకు ఏటువంటి విఘాతం కలుగకుండా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు సంతోషంగా తిరునాళ్ళ జరుపుకోవచ్చన్నారు. ప్రజల విశ్వాసాలతో ముడిపడిన ఇలాంటి విషయాలపై అసత్య ప్రచారాలు చేయవద్దని ప్రధానంగా సోషల్ మీడియా కు విజ్ఞప్తి చేశారు. తిరునాళ్లకు వచ్చే భక్తులు, అశేష జన వాహిని తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్సీ విశాల్ గన్ని కోరారు.